డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాల పై ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు .. తిరుమల లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ ప్రకటించినప్పుడు ఉదయినిది స్టాలిన్ ను టార్గెట్ చేశారు పవన్ . ఆ స‌మ‌యంలో ఇది హాట్ టాపిక్ గా మారింది .. డీఎంకె సోషల్ మీడియాలో పవన్‌ను ట్రోలింగ్ కూడా చేసింది .. ఆ తర్వాత అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ జన్మదినం సందర్భంగా  ఆయనను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు తాజా గా అన్నాడీఎంకే పార్టీ 53 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరో పోస్ట్ పెట్టారు . ఇది కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


పవన్ హిందుత్వం నినాదం వినిపిస్తూ .. అన్నా డీఎంకే ను పొగడటం డీఎంకె వర్గాల ను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి . అసలు అన్నా డీఎంకే పై పవన్ కళ్యాణ్ ఆసక్తి ఎందుకు అన్న చర్చ కూడా అక్కడ గట్టి గా నడుస్తుంది . ఇక నిజానికి పవన్ కు తమిళనాడు లో బీభత్సమైన ఫాలోయింగ్ కూడా లేదు . ఆయన సినిమాలు కనీసం అక్కడ డబ్బింగ్ కూడా కావు కానీ సనాతన ధర్మ రాజకీయం తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది . తమిళ్ నాట ఆయన సినిమా స్టార్ కన్నా రాజకీయ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .


రాజకీయ నేతలు ముందస్తు గా ప్రణాళికలు లేకుండా ఏమి చేయరూ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అలాగే బిజెపి తో పొత్తు ఉన్న పవన్.. బిజెపితో విడిపోయిన అన్నాడీఎం కే పై అమితమైన అభిమానం చూపించడం వెనక కూడా కచ్చితంగా ఏదో రీజన్ ఉంటుందని కూడా అంటున్నారు. అదేమిటో త్వరలోనే మెల్లగా బయటకి కూడా వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: