ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో ఒకే దశలో నవంబర్ 20 న పోలింగ్ జరగనుండగా ... కౌంటింగ్ నవంబర్ 23 న జరపనున్నారు. మరి కెసిఆర్ ముందు చెప్పినట్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారా ? లేదా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. జాతీయ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు తెలంగాణ లో బీఆర్ ఎస్ చేయడానికి ఏం లేదు. మరో నాలుగేళ్ల పాటు వారు ప్రతిపక్షంలో ఉండాల్సిందే. ఇక పార్టీ పేరు మార్చినందుకు అయినా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిలిస్తే బిఆర్ఎస్ ప్రభావం అక్కడ ఎంత మేర ఉన్నది అన్న విషయం బయట పడుతుంది. అయితే ఇక్కడ లెక్క వేరుగా ఉంది. తెలంగాణ లో పార్టీ ఓటమి పాలు అయిన వెంటనే కెసిఆర్ అసలు మహారాష్ట్ర అంశాన్ని వదిలేశారు.
ఎప్పుడు అయితే కేసీఆర్ మహారాష్ట్ర ను వదిలేశారో... గతంలో బిఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నాయకులు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరుణంలో కెసిఆర్ రంగంలోకి దిగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక కేటీఆర్ కూడా గతంలో ఓ డైలాగ్ వదిలారు... మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నప్పుడు బిఆర్ఎస్ ఎందుకు జాతీయ స్థాయిలో సత్తాచాటకూడదు అంటూ కేటీఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందే అన్నారు. మరి ఇప్పుడు రీసెంట్‌గా కూడా ఎన్టీఆర్ దేవర పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు బిఆర్ఎస్ నిజంగా మహారాష్ట్రలో పోటీ కి దిగుతారా.. సత్తా చాటుతారా ? అన్నది చూడాలి.