బూంబూం బీర్లపై ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీలో కోహ్లీ, సచిన్‌ బ్రాండ్లు కూడా తీసుకొస్తాడని బాంబ్ పేల్చారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఏపీ కొత్త మద్యం పాలసీపై ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బ్రాండ్లు రిలీజ్ చేశారని 2019 విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మన హయాంలో వచ్చిన బ్రాండ్లంటూ అబద్ధాలు ప్రచారం చేశారని ఆగ్రహించారు.


బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్, 999 లెజెండ్..999 పవర్ స్టార్ బ్రాండ్లన్నీ చంద్రబాబు తీసుకొచ్చినవే అంటూ క్లారిటీ ఇచ్చారు జగన్. మా హయంలో 30 షాప్స్ తగ్గించామని... లాభాపేక్ష లేకుండా ప్రభుత్వంతో షాప్స్ నడిపామని గుర్తు చేశారు.  వైన్స్ షాప్స్ కి టైం, పర్మిట్ రూమ్స్ రద్దు, బెల్ట్ షాప్స్ కట్టడి చేసేలా మేం చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాప్స్ నడిచాయని వెల్లడించారు.


మద్యం ధరలు పెంచి మద్యం నియంత్రణ చేసేందుకు ప్రయత్నించామన్నారు. చంద్రబాబు హయాంలో అమ్మకాలు పెరగ్గా వైసీపీ హయంలో అమ్మకాలు తగ్గాయి కానీ ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.  మద్యం నియంత్రించి ఆదాయాన్ని పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. చంద్రబాబు మాత్రం మద్యం ధర తగ్గించి, క్వాలిటీ తగ్గించి, ఆదాయం తగ్గించి డిస్తలరీకి వాల్యూం పెంచి సొంత ఆదాయం పెంచుకుంటున్నారని వివరించారు.


ప్రభుత్వ షాప్స్ రద్దు చేయటం పెద్ద స్కామన్నారు. ప్రభుత్వం షాప్స్ నడిపినపుడు అదే రోజు సాయంత్రం డబ్బులు జమ అయ్యేవి... ఇపుడు తన మాఫీయా కు మద్యం దుకాణాలు ఇచ్చేసారని బాంబ్‌ పేల్చారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రతి నియోజక వర్గంలో కూడా ఇదే విధంగా మద్యం మాఫీయా పని చేస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: