ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పలు రకాల కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూ ముందుకు వెళ్తోంది.. ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అనే విధంగా కూటమి ప్రభుత్వం పైన ప్రజలు చాలా కోపంగా ఉన్నప్పటికీ , ఇలాంటి సమయంలోనే మళ్ళీ జన్మభూమి కాన్సెప్ట్ ని మరొకసారి తెరమీదకి తీసుకు వస్తున్నారు. సీఎం చంద్రబాబు. గతంలో 2014, 2019 మధ్య ఈ జన్మభూమి కమిటీలను తీసుకురావడం జరిగింది. జన్మభూమి కమిటీ అంటే కేవలం టిడిపి నేతలకు నచ్చిన వారికి అన్నిటిని ఇస్తారని, మిగతా వారిని వదిలేస్తారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.


అలా 2019 ఎన్నికలలో ఇది కూడా టిడిపి ఓడిపోవడానికి ఒక కారణమయ్యింది. ఇప్పుడు అలాంటి పద్ధతిని మళ్లీ  తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండడంతో.. వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం పైన గతంలోని తెలియజేశారు. అయితే ఈ విషయం మీద ఎన్నికల ముందు టిడిపి నాయకులు మౌనంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు జన్మభూమి కమిటీ అంటే అపోహలు అనుమానాలు వంటివి మొదలవుతున్నాయట.


ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదాయం లేకున్నప్పటికీ జన్మభూమి కమిటీ సభ్యులు ఏది చెబితే అదే జరుగుతుంది అనేట్టుగా ప్రజలలో అపోహ ఉన్నది. ఇది అప్పటి సర్కార్ కు చాలా తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలలో ఈ విషయాన్ని చెప్పకుండా ఇప్పుడు మళ్లీ జన్మభూమి కమిటీలకు పచ్చ జెండా ఊపుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చాలామంది నేతలతో పాటు ప్రజలు కూడా బాబోరు ఏమీ మారలేదు మళ్లీ అదే పద్ధతి తీసుకు వస్తున్నారు అంటూ పెదవి విరుస్తున్నారు. దీంతో జన్మభూమి కమిటీలు నిర్వహించే వారందరికీ కూడా పెత్తనం ఎక్కువగా ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ఈ నిర్ణయం సరైనదా ?కాదా?  అనే విషయాన్ని ఆలోచిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: