మహిళా మంత్రి చేత తన కాళ్లు మొక్కించుకున్నారని నందమూరి బాలయ్య పై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత... నందమూరి బాలయ్య కాళ్ళు మొక్కిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవాళ నారా చంద్రబాబు అధ్యక్షతన... అమరావతిలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు హాజరయ్యారు.
ఇందులో భాగంగానే నందమూరి బాలయ్య.. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లారు. అదే సమయంలో ఏపీ హోమ్ మినిస్టర్ అనిత... టిడిపి కార్యాలయానికి రావడం జరిగింది. ఇద్దరు ఒకేసారి ఎదురు పడటంతో... నందమూరి బాలయ్య కాళ్ళ పైన పడిపోయింది ఏపీ హోం మంత్రి అనిత. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా బాగా వాడుకుంటుంది.
నందమూరి బాలయ్య వార్నింగ్ ఇస్తేనే... అనిత అలా చేసిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. కానీ.. నందమూరి బాలయ్య వయసులో పెద్దవాడు కాబట్టి... ఏపీ హోం మంత్రి అనిత కాళ్ళు మొక్కరని కొంతమంది చెబుతున్నారు. మంత్రి స్థాయిలో ఉండి... ఇలా ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం ఏంటని కూడా మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం రచ్చ రచ్చ అవుతోంది. ఇది ఇలా ఉండగా హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా బాలయ్య గెలిచిన సంగతి తెలిసిందే.