ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. మళ్లీ వచ్చేది వైసీపీ పార్టీ ప్రభుత్వమేనని జగన్మోహన్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అందరికీ అదే అర్థమవుతుందని.. బాంబు పేల్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఏపీ మద్యం పాలసీ.. అలాగే చంద్రబాబు వందరోజుల పాలన... జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో.. చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ఏకిపారేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.


ప్రభుత్వ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు... చంద్రబాబు ప్రభుత్వ... విధానాలను ఎండగట్టారు. ముఖ్యంగా మద్యం పాలసీలు అక్రమాలు జరిగాయని... ఒక్క వైన్ షాప్ మీద... 20 నుంచి 30 శాతం దండుకున్నారని కూడా బాబు పేల్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. 99 రూపాయలకు క్వార్టర్ బాటిల్  అంటూ.. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని కూడా ఆగ్రహించారు. గతంలో 120 రూపాయలకు వాటర్ బాటిల్ ఇచ్చామని... అందులో నాణ్యత ఉంటుందని తెలిపారు. ఇప్పుడు 99 రూపాయలకు ఇస్తే అందులో ఏ మేరకు నాణ్యత ఉంటుందని నిలదీశారు.


ఇది కల్తీ ముందుకు దారి తీసే.. ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా.. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మోడల్ లాంటి బ్రాండ్లను తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. 2019 అప్పుడు... చంద్రబాబు ఆపద్బాంధవ ముఖ్యమంత్రిగా ఉండి మరి... ఈ చీప్ లిక్కర్లన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు అనవసరంగా తమపై ప్రచారం చేస్తున్నారని.. ఆ బ్రాండ్లను నేను తీసుకువచ్చినట్లు చెబుతున్నారని మండిపడ్డారు.


చంద్రబాబుకు నచ్చితే బాలయ్య అలాగే మహేష్ బాబు బ్రాండ్లు కూడా సెటైర్లు వేశారు.  అవసరమనుకుంటే సచిన్ టెండూల్కర్ లేదా విరాట్ కోహ్లీ బ్రాండ్లు కూడా ఏపీలో వస్తాయని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీని తెలుగుదేశం కూటమి ఇబ్బంది పెడుతుందని... కచ్చితంగా తాము పడిలేస్తామని హెచ్చరించారు.  తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి కూడా వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే.. బంతి అంత గట్టిగా లేస్తుంది అని కూడా వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: