2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా 2024 ఎన్నికల్లో మాత్రం కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ స్థాయిలో పార్టీ పతనం అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. రాష్ట్రంలో వైసీపీ పుంజుకోవడం సాధ్యం కాదని క్లారిటీ వచ్చేసింది. అయితే ఎన్నికల ఫలితాలతో అయినా జగన్ లో మార్పు వస్తుందని భావించిన వాళ్లకు నిరాశే ఎదురవుతోంది. కొంతమంది నేతల వల్ల పార్టీ పతనానికి జగన్ నాంది పలుకుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ ను కొన్ని సూపర్ పవర్స్ శాసిస్తున్నాయని కో ఆర్దినేటర్స్ విషయంలో జగన్ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోపాలు తెలుసుకోకుండా జగన్ ముందడుగులు వేస్తే ఏం సాధిస్తారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. మెగా డీఎస్సీ, సీపీఎస్ రద్దు, దశలవారీగా మద్య నిషేధం చేయకపోవడం వల్లే జగన్ కు అధికారం దూరమైందని చాలామంది ఫీలవుతారు.
 
విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ అప్పగించి తన కన్నును తానే పొడుచుకుంటున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ వైసీపీ ఓటమికి కారణమైన వ్యక్తులనే ఇప్పటికీ నమ్ముకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. జగన్ ఎప్పటికి మారతారో అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. బాబును చూసి జగన్ నేర్చుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
పాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని ఈ విషయం జగన్ కు ఎప్పుడు అర్థం అవుతుందో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ఇలా ఉంటే 2029లో కూడా వైసీపీకి అధికారం కష్టమేనని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ కు ఏపీలో 40 శాతం ఓటు బ్యాంక్ ఉండగా ఆ ఓటు బ్యాంక్ ను తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తన తప్పుల విషయంలో జగన్ ఎప్పటికి మారతారో అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: