ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో టిడిపి వర్సెస్ జనసేన... మధ్య ఏదో ఒక చిన్న వివాదం తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు... ఊహించని షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తొలగించే ఛాన్స్ ఉందట.
దీనికి సంబంధించిన వార్తలు ఎల్లో మీడియా లోనే ఎక్కువగా వస్తున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను పక్కకు పెట్టి నారా లోకేష్ కు ఆ పదవి ఇవ్వబోతున్నారట. ఇటీవల మంత్రులకు జిల్లాల ఇన్చార్జి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ అటు నారా లోకేష్ కు పదవులు ఇవ్వలేదు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను దించేసి నారా లోకేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చేందుకే ఇలా వ్యవహరించాలని కొంతమంది అంటున్నారు.
ఇక మరి కొంతమంది అయితే... డిప్యూటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ కి ఇస్తారని... హోం మంత్రి పవన్ కళ్యాణ్ కు ఇస్తారని చెబుతున్నారు. ఇక మరి కొంతమంది... పవన్ కళ్యాణ్ కించపరిచేలా... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పదవుల్లో ఏ తేడా వచ్చిన... జనసేన తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. అదే ఇదంతా వైసిపి సోషల్ మీడియా ప్రభావం అని కొంతమంది చెబుతున్నారు. మొత్తానికి ఈ అంశం హాట్ టాపిక్ అయింది.