ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి మరో లీడర్ రాజీనామా చేసే యోజనలో  కనిపిస్తున్నారు. వరుసగా కేసులు, ఈడి దాడులు  జరుగుతున్న నేపథ్యంలో.. వైసిపి పార్టీకి దూరం అయ్యేందుకు రెడీ అయ్యారట మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ. గతంలో కిడ్నాప్ కేస్ తో హాట్ టాపిక్ అయిన సత్యనారాయణ... ఇప్పుడు పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సత్యనారాయణ రెడీ అయినట్లు... సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత...మాజీ ఎంపీ సత్యనారాయణ లాంటి... నేతలపై టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో నేతలు ఉక్కిరిబిక్కిరి.. కూటమి ప్రభుత్వానికి లొంగిపోతున్నారు.

 

అయితే ప్రస్తుతం ఎం వివి సత్యనారాయణ  ఇంట్లో కూడా ఈడి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ డబ్బు దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇంట్లో ప్యాకింగ్ బండల్స్  కూడా దొరికినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు ఈడి.... అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే.. ఈడి అధికారుల నుంచి తప్పించుకునేందుకు... తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఆ పార్టీలోకి వెళ్తే తన ఆస్తులను కాపాడుకోవచ్చని... సత్యనారాయణ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే... సత్యనారాయణ ను తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారట. సత్యనారాయణ లాంటి నేతలను పార్టీలో చేర్చుకుంటే మళ్లీ నెగిటివ్...వైబ్రేషన్స్ ప్రజల్లోకి వెళ్తాయని కొంతమంది భావిస్తున్నారట. అయితే ఇలాంటి సమయంలో వైసీపీని దెబ్బ కొట్టాలంటే బడా నేతలను చేర్చుకోవాల్సిందే అని కొంతమంది అంటున్నారట. మొత్తానికి ఏడి దెబ్బకు mvv సత్యనారాయణ  పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి  mvv సత్యనారాయణ  పార్టీ మారబోతున్నారని వస్తున్న వార్తలపై వైసీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: