ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్రమైన తిరుమల శ్రీవారి దేవస్థానంలో అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల భక్తులకు అవమానం జరిగేలా... కొన్ని కథనాలు ప్రసారమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు చేసిన తప్పిదాల వల్ల తిరుమల శ్రీవారి దేవస్థానానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తిరుమల బ్లాక్ టికెట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో... అక్రమంగా దర్శన టికెట్లు అమ్ముకున్నారట.


తిరుమల శ్రీవారి సన్నిధిలో విఐపి దర్శన టికెట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విఐపి దర్శన టికెట్లను వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జాకియా ఖానం అనే మహిళ నాయకురాలు అమ్ముకున్నారట. ఈ విషయాన్ని గుర్తించిన టిటిడి అధికారులు... ఆమెపై  కేస్ కూడా పెట్టారు. ఓ సామాన్య భక్తుడి ఫిర్యాదుతో ఈ సంచలన విషయం బయటకు వచ్చిందట. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ పాలనలో... ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.

బ్లాక్ లో విఐపి దర్శన టికెట్లను... వైసీపీ ఎమ్మెల్యే జాకియా ఖానం ... అమ్ముకున్నారట. ఈ మహిళ ఎమ్మెల్సీ ఇచ్చిన సిఫారసు లేకపోయినా ఏకంగా ఆరు టికెట్లు.. పొందారట భక్తులు. ఇందులో ఆరు టికెట్లకు గాను 65 వేల రూపాయలు... ఎమ్మెల్సీకి దక్కినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం బయటకు రావడంతో... ఆమెపై పోలీసు కేసు నమోదు అయింది. తిరుమల విఐపి టికెట్ల స్కామ్ లో...వైసీపీ ఎమ్మెల్యే జాకియా ఖానం  A2 ముద్దాయిగా కేసు నమోదు అయింది.

A1 నిందితుడిగా చంద్రశేఖర్ పేరును చేర్చారు పోలీసులు. అలాగే ఏ3గా ఎమ్మెల్సీ జాకియా ఖానం పిఆర్ఓ  కృష్ణ తేజ పేర్లు చేర్చారు తిరుమల పోలీసులు.అయితే... ఈ సంఘటనపై వైసీపీ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎమ్మెల్సీ జాకియా ఖానం  తో వైసిపి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.  జాకియా ఖానం ను పార్టీలో నుంచి ఎప్పుడో తీసేసామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉన్నారని వెల్లడించారు. జాకియా ఖానం  తో.. తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు బొత్స సత్యనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: