అగార్ వుడ్ చెట్టు గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ చెట్టు సువాసనలు వెదజల్లే కలపనూ, నూనెను అందిస్తుంది. మన దేశంలో కూడా అగార్ వుడ్ సాగవుతుండగా విదేశాల్లో అగార్ వుడ్ కు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అగార్ వుడ్ చెట్టును ఒకటి పెంచుకున్నా సులువుగా కోటీశ్వరులు అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అగార్ వుడ్ తో సువాసన ఉన్న కలప, అత్తరు, అగర్బత్తీలను తయారు చేస్తారు. మలేషియా, లావోస్, సింగపూర్ దేశాలలో అగార్ వుడ్ ను ఎక్కువగా పండించడం జరుగుతుంది. అరబ్ దేశాలలో విరివిగా కలప, కలప ఉత్పత్తులను వినియోగించడం జరుగుతుంది. ఈ చెట్ల ద్వారా ఆదాయం పొందాలంటే 4 సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.
40 సంవత్సరాల పాటు అగార్ వుడ్ చెట్టు ద్వారా ఆదాయం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అగార్ వుడ్ చెక్క ముక్కలను కిలోల చొప్పున అమ్మడం జరుగుతుంది. కిలో చెక్క ఏకంగా లక్ష రూపాయలు పలుకుతుంది. ఈ చెక్క ముక్కల నుంచి తయారు చేసిన నూనె 30 లక్షల రూపాయల నుంచి 70 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. అగార్ వుడ్ ఆకులు కూడా ఎంతో ప్రయోజనకరమైనవని చెప్పవచ్చు. అగార్ వుడ్ సాగు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.