ఇటీవల కాలంలో వివిధ దేశాల్లో యుద్ధాలు ప్రకటిస్తూ ప్రపంచ దేశాలకు షాక్‌లిస్తున్నారు దేశాధినేతలు. రష్యా, ఉక్రెయిన్ తర్వాత కొన్ని ముస్లిం కంట్రీలు కూడా యుద్ధాలకు తెగబడ్డాయి. వీటివల్ల ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. మూగజీవులు అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో తుది శ్వాస విడుస్తున్నాయి. ఈ దేశాల్లో యుద్ధాలు చేరడం వల్ల మిగతా ప్రపంచం మొత్తం కూడా ప్రభావితమవుతోంది అంతేకాదు ఇతర దేశాలను కూడా ఈ దేశాలు యుద్ధాలకు ప్రేరేపించినట్లు అవుతోంది.

ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన దేశ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇది చాలా పెద్ద దేశం ఈ దేశం యుద్ధానికి సిద్ధమైతే ప్రపంచం అల్లకొల్లోలమయ్యే ప్రమాదం ఉంది. ఇటీవలే చైనా తైవాన్ చుట్టూ భారీ సైనిక కవాతులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇవ్వడంతో తైవాన్ ప్రజలు వణికి పోతున్నారు.

చైనా సైన్యం క్షిపణి దళాన్ని సందర్శించిన జిన్‌పింగ్, సైన్యం యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని, సైనికులు అత్యుత్తమ యుద్ధ సామర్థ్యాలను కలిగి ఉండాలని అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యం తమ దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చైనా, తైవాన్ దేశాల మధ్య గొడవ పెరిగింది. చైనా తైవాన్‌ను తనదే అని చెప్పుకుంటుంది. తైవాన్ స్వతంత్ర దేశమని అంటుంది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చైనా తైవాన్ దగ్గర భారీ సైనిక కవాతులు చేసింది. అంటే, తాము ఎప్పుడైనా తైవాన్‌పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా చెప్పినట్లే.

చైనా తైవాన్ దగ్గర భారీ సైనిక కవాతులు చేసిన తర్వాత తైవాన్, అమెరికా దేశాలు స్పందించాయి. తైవాన్ దేశం చైనా చేసిన పనిని తప్పుబట్టింది. చైనా ఏమి చేసినా తమ దేశం సిద్ధంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా, చైనా నౌకలు తమ దేశానికి చెందిన సముద్రంలోకి ప్రవేశించాయని తెలిపింది. అమెరికా కూడా ఈ విషయంలో స్పందించింది. అమెరికా సైన్యం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: