ఇటీవలే బద్వేల్ కాలేజీ విద్యార్థి అత్యాచారం ఘటన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ని ఉలిక్కిపాటికి గురిచేసింది.. గత కొద్దిరోజులుగా ఏపీలో మహిళల పైన విద్యార్థుల పైన అత్యాచారం ఘటనలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది.


కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని కాపాడలేక పోతోంది అంటూ తెలియజేయడమే కాకుండా ఇదేమి రాజ్యం చంద్రబాబు మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండానే పోతోంది ప్రతిరోజు ఏదో ఒకచోట హత్యలు వేధింపులు అత్యాచారాలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి అంటూ ప్రశ్నించారు. చదువుకొనే విద్యార్థి పైన పెట్రోల్ పోసి మరి నిప్పు పెట్టడం చాలా అత్యంత దుర్మార్గము వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ తెలిపారు. ఈ సంఘటనల పైన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ కూడా వైఫల్యం ఉన్నదంటూ తెలియజేశారు జగన్.



ఎవరైనా పాలకుడు పాలిస్తున్నాడు అంటే ప్రజలు ధైర్యంగా ఉండాలి కానీ భయపడే స్థాయికి మీరు ఏపీ నీ తీసుకువెళ్లారంటూ ట్విట్ చేశారు. వైసిపి పార్టీ మీద కక్షతోనే మా పథకాలను కార్యక్రమాలను ఎత్తివేశారు రాష్ట్ర ప్రజల మీద కక్ష సాధిస్తున్నారు అంటూ రాసుకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలు బాలికలకు చాలా భద్రత భరోసా ఉండేది దిశా కార్యక్రమాన్ని కూడా ఇలాంటి ఉద్దేశాలను ఉద్దేశించే ప్రారంభించాము.. కేవలం దిశా యాప్ లో ఉండే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు సంఘటన స్థలానికి నిమిషాలలో రక్షణ శాఖ చేరేది మీరు ఇలాంటి వ్యవస్థను నీరు కార్చారు అంటూ తెలిపారు.


మా హయాంలో శాంతిభద్రతలకు ఎలాంటి డోకా లేదు అత్యంత ప్రాధాన్యత మహిళలకే ఇచ్చాము పోలీసులు ఎల్లవేళలా కూడా చాలా అప్రమత్తంగా ఉండేవారు అంటూ తెలిపారు. ఇప్పుడు అన్ని స్కీములను ఎత్తేసి ఇసుక, లిక్కర్లాంటి స్కాములను పేకాట క్లబ్బులను మాత్రమే నిర్వహిస్తూ.. ప్రతిపక్షం పైన తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ సీఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: