ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను సైతం ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సైతం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇటీవలే తెలియజేశారు. అలాగే పథకం అమలు తేది ఎవరెవరికి ఇస్తారు ఎలాంటి షరతులు ఉంటాయని విషయాలను కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.


ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీలో దీపావళి సందర్భంగా ప్రారంభిస్తున్నామంటూ తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. సూపర్ సిక్స్ లో భాగంగా మూడు ఉచిత సిలిండర్లను ఇస్తామని చెప్పాము అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ తెలిపారు. మహిళలకు ఇచ్చేటువంటి ఈ గ్యాస్ సిలిండర్ల భారం సుమారుగా ఏడాదికి ₹3,000 కోట్ల రూపాయలు అవుతుందంటూ తెలిపారు. వచ్చే క్యాబినెట్ లోనే ఈ పథకానికి సంబంధించి అనుమతిని కూడా తీసుకుంటామని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అటు డిప్యూటీ సీఎం ఇటు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తారంటూ తెలిపారు.


కూటమి ప్రభుత్వం పారదర్శకంగానే పాలన అందిస్తుంది అంటూ తెలపడమే కాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లకు కచ్చితంగా రేషన్ కార్డు అవసరమని.. రేషన్ కార్డు మీద ఉన్న ఒకరికి మాత్రమే గ్యాస్ సిలిండర్ అందిస్తారట. మొబైల్ లింక్, ఆధార్ కార్డ్ లింక్ ,గ్యాస్ బుక్ కి లింక్ అయ్యి ఉండాలి అంటూ తెలియజేశారు. అయితే ఎంతమందికి ఇస్తారు అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం దీపం కనెక్షన్ కింద ఉన్న గ్యాస్ సిలిండర్లకే అందిస్తారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మరి క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: