ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్.. అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు మద్దతు ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మద్దతుగా మస్క్‌ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మస్క్‌ కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్‌ను గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియాలో ట్రంప్‌ నిర్వహించిన  ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మస్క్‌ మాట్లాడారు.  


ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  భారత్‌లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమెరికాలో బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మనం ఈవీఎంలను వాడుతున్నామని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందన్న ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మస్క్‌ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.


ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) సాయంతో ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని ఆరోపించారు. ఓ టెక్‌ నిపుణుడిగా తనకు ఉన్న పరిజ్ఞానవంతో ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించొద్దని సూచించారు. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బ్యాలెట్‌ పేపనర్‌ను ఎవరూ హ్యాక్‌ చేయలేరని స్పష్టం చేశారు. ఓట్లను చేతులతోనే లెక్కించాలని పేర్కొన్నారు.


ఎలాన్‌ మస్క్‌ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ప్రధానంగా భారతీయ ఫాలోవర్లే ఎక్కువగా కామెంట్లు పెడుతున్నారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని చాలా మంది కామెంట్‌ చేశారు. టెన్నాలజీని వాడుకోవాలి కదా అని కొందరు పేర్కొన్నారు. అప్‌డేట్‌ అయ్యేదెప్పుడు అని మరికొందరు కామెంట్‌ చేశారు.


మస్క్‌ వ్యాఖ్యలు భారత్‌లోని రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ఇటీవల జరిగిన హర్యాన ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ తరుణంలో మస్క్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు బలంగా మారాయి. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించొద్దని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మస్క్‌ మాటలతో అయినా వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: