2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణమేంటనే ప్రశ్నకు ప్రధానంగా షర్మిలతో విబేధాలే కారణమని భావిస్తారు. షర్మిల జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల జగన్ ను అభిమానించే వాళ్లు సైతం నమ్మలేదు. మరోవైపు విజయమ్మ సైతం షర్మిలకు సపోర్ట్ చేస్తూ జగన్ కు ఒకింత షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో దారుణ ఫలితాల నేపథ్యంలో జగన్ తెలివిగా అడుగులు వేస్తున్నారు.
 
తనకు ఎదురైన ఒక్కో సమస్యను పరిష్కరించే దిశగా జగన్ అడుగులు పడుతుండటం కొసమెరుపు. షర్మిలతో ఆస్తుల పంపకాలను కొలిక్కి తెచ్చే దిశగా జగన్ అడుగులు వేశారని భోగట్టా. పంతానికి పోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని జగన్ ఫీలైనట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటే ప్రజల మద్దతును మళ్లీ సొంతం చేసుకోవడం మరీ కష్టం కాదని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
 
కుటుంబ సమస్యల పరిష్కారం దిశగా జగన్ అడుగులు వేయడం అంటే వైసీపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ ఎన్నికల ఫలితాల తర్వాత తీసుకున్న మంచి నిర్ణయం ఇదేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇదే విధంగా ముందుకెళ్తే పార్టీకి ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.
 
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మంచి నేత అని, ప్రజల సంక్షేమం కోరే నేత అని కొంతమంది ఆయనను తప్పుదోవ పట్టించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సైతం జగన్ కు మాత్రమే సొంతమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. జగన్ వైసీపీ కోసం కష్టపడితే రాబోయే రోజుల్లో కార్యకర్తలు మరింత సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.  అయితే జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: