ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వయస్సు ప్రస్తుతం 75 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. 2029 ఎన్నికల్లో లోకేశ్ సీఎం అభ్యర్థిగా ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్ స్టాపబుల్ షోలో లోకేశ్ పొలిటికల్ కెరీర్ ప్లాన్స్ పై చంద్రబాబు నాయుడు కొంతమేర క్లారిటీ ఇచ్చారని సమాచారం అందుతోంది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు షాకిచ్చేలా చంద్రబాబు కొన్ని కామెంట్లు చేశారని భోగట్టా.
 
లోకేశ్ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడం కోసం లోకేశ్ పడుతున్న కష్టం మాత్రం అంతాఇంతా కాదు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ ఎవరి కోసం చూస్తూ కూర్చోదని అలాగే పార్టీకి వారసత్వం అనేది ఉండదని కార్యకర్తగా కెరీర్ ను మొదలుపెట్టి నాయకుడిగా ఎదిగి తనను తాను ప్రూవ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే పగ్గాలు అందుతాయని బాబు చెప్పినట్టు తెలుస్తోంది. లోకేశ్ భవిష్యత్తులో సీఎం అవుతారని చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు.
 
టీడీపీ కోసం ఫ్యామిలీ అంతా బయటికొచ్చిందని నందమూరి ఆడపడుచులు సైతం కష్టపడుతున్నారని ఆయన వెల్లడించారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీకి ఎలాంటి సంబంధం లేదనే అర్థం వచ్చేలా చంద్రబాబు కామెంట్లు ఉన్నాయని భోగట్టా. జూనియర్ ఎన్టీఆర్ సైతం తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని దేవర ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చేశారు.
 
తారక్ భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందేమో కానీ ఇప్పటికైతే తారక్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టే ఛాన్స్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  కెరీర్ పరంగా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని దేవర రికార్డ్స్ కంటిన్యూ అవుతున్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: