భూగోళంపై హిమగోళంగా పిలిచే అంటార్కిటికా ఖండంకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఖండం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ హిమానినాదాలు .. మంచు .. రాళ్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ భూమిపై అత్యంత చల్లని ప్రదేశం ఇది. ఇక్కడ మొక్కలు మొలవటం ఏమాత్రం సులభం కాదు. చాలా సంక్లిష్ట పరిస్థితులలో ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో మొలిచే కొన్ని ప్రత్యేకమైన వేళ్లు లేని కాండం గల నాచులాంటి పచ్చని మొక్కల‌ కణజాలం మాత్రం ఉంటుంది.. అది కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. సూర్యకిరణాలను పరావర్తనం చెందించడం అంటార్కిటికా ఖండం ప్రత్యేకత. ఇక్క‌డ‌ పచ్చదనం పెరుగుతుంది అంటే అక్కడ ఉన్న మంచు క్రమక్రమంగా తగ్గిపోతుందని అర్థం.


ఇక్కడ 1986లో చదరపు కిలోమీటర్ల కంటే తక్కువగా ఉన్న ఈ పచ్చదనం 2021 నాటికి ఏకంగా 12 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అంటే పదింతలు కంటే ఎక్కువగా పెరిగింది. 2016 నుంచి 2021 మధ్య ఇది ఏకంగా 30% పెరిగింది. ఐదేళ్లలోనే నాలుగు లక్షల మీటర్ల మేర పచ్చదనం విస్తరించింది ఇక్కడ పచ్చదనం పెరుగుతుందంటే అంటార్కికాలో మంచు తగ్గుదలకు సంకేతం అని చెప్పాలి. అంటే సాధారణ భూమి పెరుగుతుంది దీనిని బట్టి పర్యావరణంలో మార్పులు ప్రభావం మొదలైందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతి కొద్దికాలంగా అంటార్కికాలో భూమిపై మరి ఎక్కడ లేనంత రేట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది.


ఎప్పుడు మైనస్ లో ఉండే ఉష్ణోగ్రతలు వేసవి లో 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతున్నాయి. ఇక్కడ వేడి పెరిగితే హిమాని నదాలు క‌రుగుతాయి. ఫలితంగా సముద్రమట్టాలు పెరుగుతాయి. సముద్రమట్టాలు పెరగటం మొదలు పెడితే కొంత భూమి నీళ్లలో కలిసిపోతూ ఉంటుంది. తీరప్రాంతాలు నీళ‌ల్లో మునిగిపోతాయి ..  అందుకే ఇప్పటికే అంటార్కిటికా మంచితోనే కప్పబడి ఉన్నప్పటికీ ఈ పచ్చదనంలో అనూహ్య‌మైన మార్పులు .. శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాగే పచ్చదనం పెరిగితే భూమి తయారవుతుంది .. అదే జరిగితే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: