- మంత్రిని అడ్డుకున్న పవన్ సెక్యూరిటీ సిబ్బంది
- ( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . .
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటనలో జిల్లాకే చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తీవ్ర అవమానం జరిగింది. తాజాగా విజయనగరం జిల్లా గుర్ల లో అతిసార వ్యాధితో పదిమందికి పైగా చనిపోయారు. 200 మందికి పైగా రోగం భారీన పడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుపై విమర్శలు రావడంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల లో అతీసార బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. గుర్ల పిహెచ్ సీ లోని అతిసార రోగులను పవన్ పరామర్శిస్తున్నప్పుడు ఆయనతో పాటు స్థానిక జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే శ్రీనివాస్ ను పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవటం తీవ్ర వివాదాన్ని రేపింది.
జిల్లాకు చెందిన మంత్రి లోపలి అనుమతించాలా ? అని కొండపల్లి అనుచరులు అడిగిన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. దీంతో పవన్ లోపల బాధితులను పరామర్శించి బయటకు వచ్చేంతవరకు ఆసుపత్రి గేటు బయటే మంత్రి కొండపల్లి ఉండిపోయారు. దీంతో మంత్రి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సాటి మంత్రికి పవన్ కళ్యాణ్ ఇచ్చే గౌరవం ఇదేనా ? అని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో అంతా కలిసి ఉన్నారని పైగా జిల్లాకు చెందిన మంత్రి వస్తే ఆయనను లోపలికి పంపాల్సింది పోయి సెక్యూరిటీ అడ్డుకోవడం ఏంటని గుసగుస లాడుతున్నారు. దీని మీద జిల్లా టిడిపిలోని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి పవన్ ఇకపై అయినా ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను సముచితంగా గౌరవించుకునేలా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది.