- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

తాజాగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ హెచ్చరిక జారీ చేశారు. ఇకనుంచి అవినీతి అన్నది సహించను అని క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్లిపోవచ్చని చెప్పారు. తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ చాలా స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వారిద్దరు కూడా ఉత్తరంధ్ర‌లోని కీలకమైన విశాఖ జిల్లాకు చెందిన వారు అని తెలుస్తోంది. తనకు అందిన ఫిర్యాదులు, సమాచారం మేరకు పవన్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలుస్తోంది.


ఆ ఇద్దరూ జనసేన ఎమ్మెల్యేలు.. పారిశ్రామిక వాడలు, పరిశ్రమలు వాటి వ్యవహారాల్లో.. బాగా జోక్యం చేసుకుంటున్నారని.. వారి నుంచి పెద్ద మొత్తాలు ఆశిస్తున్నారన్న విషయం పవన్ దృష్టికి వచ్చిందట. ఈ క్రమంలోనే పవన్ ఇలాంటివి తగ‌వ‌ని హెచ్చరించినట్టు విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. సాధారణంగా ఎంపీలు అంత యాక్టివ్ గా ఉండరు. కానీ.. విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇప్పుడు మొత్తం తానే అయ్యి వ్యవహరిస్తున్నారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


తన నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆయన చొర‌వ‌గా పర్యటిస్తున్నారు. సీఎం రమేష్ చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉండడంతో పాటు.. రమేష్ కు పవన్‌తో ఉన్న సానిహిత్యం నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలను పవన్ హెచ్చరించడం వెనక సీఎం రమేష్ మాట జనసేనలో బాగా చెల్లుబాటు అవుతుందని.. పవన్ ఆయనకు బాగా ప్రయారిటీ ఇస్తున్నారని.. జనసేన వర్గాల్లోనే ప్రచారం నడుస్తోంది. ఆ మాటకు వస్తే సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ఉన్న పాత తెలుగుదేశం నాయకుడు కావడంతో.. అక్కడ కూడా ఆయన మాట ఇంకా చెప్పాలంటే చంద్రబాబు దగ్గరే చెల్లుబాటు అవుతుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: