గత కొంతకాలంగా చూసుకుంటే రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు సర్వసాధారణం అయిపోయాయి అనే చెప్పుకోవాలి. అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన, ప్రతిపక్ష పార్టీలో కొంతమందిని ఏరి కోరి మరి, ఇరకాటంలో పెడుతున్న సందర్భాలను మనం అనేకం చూసాం. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కొంతమంది, అధికారంలో లేని పార్టీ నాయకుల్లోనే కొంతమందిని టార్గెట్ చేస్తూ అనేకమైన, అసంబంధమైన వ్యాఖ్యలను చేయడం మనం చూస్తూ ఉంటాం. కట్ చేస్తే సదరు ప్రతిపక్ష పార్టీలు, అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని టార్గెట్ చేస్తూ కటకటాల వెనక్కి నెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైయస్సార్సీపి అధికారంలో ఉన్నప్పుడు, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చాలా దారుణమైన మాటలతో, సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. కట్ చేస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, పలు రకాల కేసులతో బూరగడ్డ అనిల్ ని అరెస్టు చేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు తమ టాలెంటును చూపిస్తున్నారు... అయితే అది వేరే విషయం!
ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పట్ల కొంతమంది అనుకూలంగా స్పందిస్తే, కొంతమంది విశ్లేషకులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. తల విషయం ఏంటంటే, టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... చాలామంది వైసీపీ నాయకులు తమకు నోరు ఉంది కదా అని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ... రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అవినాష్ వంటి వారు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఈ మాజీ మంత్రులు హద్దులు దాటి మరి అప్పటి టిడిపి ప్రధాన నాయకుల విషయంలో రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయితున్నప్పటికీ, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు పలు విమర్శలకు దారి తీస్తోంది. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కావాలని మర్చిపోయారా, లేదంటే వారిపై ఉన్న సాఫ్ట్ కార్నర్ వలన వదిలేసారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం, బలమైన వర్గాలకు మరొక న్యాయమా అంటూ విమర్శలు చేస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. అయితే దానికి ఇంకా సమయం ఉందని, అప్పుడే ఇలా మాట్లాడడం సరికాదని మరి కొంతమంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పట్ల మీ అభిప్రాయం ఏమిటో ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి.