అయితే తిరుమల శ్రీవారి.... సన్నిధిలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవమానం జరిగిందట. అసలు ఆ నేతల కు... సరైన ఏర్పాట్లు చేయలేదట. ప్రత్యేక దర్శనాలపై ఫోన్లు చేస్తే... టిటిడి పాలక మండలి ఈవో స్పందించలేదట. అయినప్పటికీ భరించిన తెలంగాణ నేతలు... తిరుమల శ్రీవారిని ఎలాగో అలాగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి... చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏకిపారేశారు.
నారా చంద్రబాబు నాయుడు కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్రానికి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రజా ప్రతినిధి వచ్చిన.... గౌరవంగా చూసుకుంటామని గుర్తు చేశారు. యాదాద్రి లేదా భద్రాద్రి.. ఇలా ఏ టెంపుల్ కి వెళ్లిన... ఒక ఫోన్ చేస్తే ఏపీ నాయకుల కు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయిస్తామని గుర్తు చేశారు. కానీ తిరుమల లో అలా పరిస్థితి లేదని ఫైర్ అయ్యారు.
తెలంగాణ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు తిరుమల లో అసలు ప్రాధాన్యత దక్కడం లేదని... బల్మూరి వెంకట్ లాంటి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సర్కార్ ఇలాగే వ్యవహరిస్తే... ఏపీకి చెందిన నేతలను యాదాద్రి అలాగే భద్రాచలం రానివ్వకుండా బైకాట్ చేస్తామని హెచ్చరించారు. మీరు తగ్గకపోతే... మా ప్రతాపం ఏంటో చూపిస్తా మన్నట్లుగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం తార స్థాయికి చేరింది.