ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ... ప్రతిపక్ష హోదాలో ఉండి... అనేక సవాలను ఎదుర్కొంటోంది. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసిపి పార్టీ... ఓడిపోవడంతో నేతలందరూ జారుకుంటున్నారు. అసలు వైసీపీలో ఉండేది లేదన్నట్లుగా... ఆ పార్టీతో సంబంధం లేదన్నట్లుగా... కొంతమంది బయటికి వెళ్లిపోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గంలో వైసిపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.


కుప్పం నియోజకవర్గంలో వైసిపి పార్టీ కార్యాలయాన్ని మూసివేసే ప్రయత్నంలో భరత్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైసిపి నేతలు అందరూ  తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైసిపి పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పుడు కేవలం భరత్ లాంటి పెద్ద లీడర్ తప్ప.. ఎవరూ లేరు.


చంద్రబాబు నాయుడు ను కుప్పం నియోజకవర్గంలో ఓడించేందుకు భరత్ను సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి... డెవలప్ కూడా చేశారు. భరత్ ను కుప్పం నియోజకవర్గంలో గెలిపిస్తే మంత్రిగా కూడా చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. కానీ ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గెలిచారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో వైసిపి పార్టీ ఆటలు  సాగలేదు.


ఇక ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మరింత ఉంచుకుంటుంది. దీంతో వైసిపి పార్టీ కార్యాలయాన్ని మూసివేయాలని భరత్ అనుకుంటున్నారట. దానిని ఓ రెస్టారెంట్ కి ఇచ్చి కిరాయి తో బతుకుదామని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు ఈ అంశం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. వైసిపి పార్టీ కార్యాలయాన్ని తీసేస్తే మీటింగ్ ఎక్కడ పెట్టుకోవాలని నేతలు అంటున్నారట. అంతేకాదు భరత్ పై ఫైర్ అవుతున్నారట అక్కడి నేతలు. మరి దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: