ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మాజీ మంత్రి విడదల రజిని... తన స్టైల్ లో పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికారం కోల్పోవడంతో.. ఆమె వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఎదగడానికి.. కొత్త స్కెచ్ లు వేస్తూ ముందుకు వెళ్తున్నారు.ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వినియోగించుకోవాలని నేపథ్యంలో... ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఈ లేడీ ఫైర్ బ్రాండ్. అయితే మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి రజిని గుడ్ బాయ్ చెప్పే టైం వచ్చినట్టు తెలుస్తోంది.


అంతకుముందు తెలుగుదేశం పార్టీలో రాజకీయ  ఓనమాలు నేర్చుకున్న రజిని... ఆ తర్వాత వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ తరుణంలోనే చిలకలూరిపేట ఎమ్మెల్యేగా.. పత్తిపాటి పుల్లారావు  లాంటి బడా లీడర్లు ఓడించారు విడదల రజిని. దీంతో జగన్మోహన్ రెడ్డి రెండవ ఎడిషన్ లో మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు విడుదల రజిని. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సారి మంత్రి పదవి రావడం ఆమె అదృష్టమే అని చెప్పవచ్చు.


ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే... 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి చిలకలూరిపేటలో...రజనీ గ్రాఫ్ పడిపోయిందని లెక్కలు తేల్చాయి. దీంతో ఆమెను అక్కడి నుంచి తప్పించారు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు వెస్ట్ కు తరలించేశారు. అక్కడికి తరలించిన కూడా విడుదల రజనీకి ఎదురుగాలి తప్పలేదు. దాదాపు 50 వేల కోట్ల మెజారిటీతో... లేడీ ఫైర్ బ్రాండ్ ఓడిపోయారు.


దీంతో ఇప్పుడు ఎలాంటి పదవి లేకుండా విడుదల రజిని... డీలా పడిపోయారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ మాజీ మంత్రి రజిని గురించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఈ వారంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జనసేనలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ద్వారా రజనీ కూడా ఆ పార్టీలోకి జంపు కావాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: