ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల తయారీ పరిశ్రమలతో పాటు డ్రోన్ టెస్టింగ్ సదుపాయాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. డ్రోన్ హబ్ ఏర్పాటు ద్వారా ఇక్కడ స్టార్టప్ పరిశ్రమలు సైతం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ డ్రోన్ సంబంధిత బిజినెస్ లకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అందిస్తుందని చెప్పవచ్చు.
ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల కర్నూలు విమానాశ్రయంలో ఉన్న రన్ వేను డ్రోన్ల పరిశీలన కోసం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. డ్రోన్ తయారీ పరిశ్రమలకు అవసరమైన అనుబంధ కంపెనీల ఏర్పాటు కోసం ఏకంగా 10,000 ఎకరాలు అందుబాటులో ఉండటం గమనార్హం. హైదరబాద్ బెంగళూరు నగరాలకు ఓర్వకల్లు దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు.
డ్రోన్ల రంగంలో మన దేశం వాటా ప్రస్తుతం కేవలం 3 శాతం మాత్రమే కాగా ఈ వాటాను 20 శాతానికి పెంచడానికి కేంద్రం భావిస్తుండటం గమనార్హం. ఏకంగా 12,500 మందికి ఉపాధి కల్పించే దిశగా ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించడం గమనార్హం. ఓర్వకల్లు అభివృద్ధి దిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను ఆ ప్రాంత వాసులు మాత్రం ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు లో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన గతంలో ఎప్పుడూ జరగలేదని నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
.