- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన శ్యామలారావు
- ప్రభుత్వం మారినా వైసీపీ నాయకులపై తగ్గని ప్రేమ
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) . .
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సిఫార్సు లేక మీద.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 26 మందికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు .. అప్పుడు మంత్రిగా ఉన్న బొత్సతో అనుబంధం ఉన్న టిటిడి ఈవో ఆయన మీద ఉన్న అభిమానంతో ఎక్కువ దర్శనాలు ఇచ్చారట. ఇప్పుడు దీనిపై కొందరు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో.. ఆయనను తిట్టారని వార్త వచ్చింది.
మామూలుగా ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేకపోయి రోజుకు ఆరుగురు చొప్పున టిడిపి దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సిఫార్సు లేకపోయినా.. ఏకంగా 26 మందికి దర్శనం కల్పించిన విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. గతంలో బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో అదే శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి జేసి శ్యామలారావు బాధ్యతలు నిర్వర్తించారు. బొత్సతో ఆ అనుబంధం ఉన్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలు ఎక్కువ ఇచ్చారని.. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది.
గతంలో వైసిపి ప్రభుత్వంతో అంటకాగి.. ఇప్పుడు కూడా ఆ పార్టీ నేతలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ టిడిపి మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి. పాత పరిచయాల పేరుతో వైసిపి నేతలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రాధాన్యం ఇవ్వటం ఏంటని ? టీటీడీ ఈవో శ్యామలా రావుని.. చంద్రబాబు మందలించారని తెలుస్తోంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. పార్టీ వాళ్ళు చర్చించుకుంటున్నారు.