- సబ్జెక్ట్ లేకుండా పసలేని విమర్శల తో రాజకీయం
- ఏపీలో దిక్కూ మొక్కూ లేని కాంగ్రెస్ ఎలా బతికేది .. !
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మీడియా ట్రాప్‌లో పడిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది రాజకీయ నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు సబ్జెక్టు తెలుసుకుని దాని ప్రకారం రాజకీయాలు చేస్తూ పాపులారిటీ పెంచుకుంటారు. అయితే షర్మిల మాత్రం సబ్జెక్టు లేకుండా కేవలం విమర్శలు చేయాలి అన్న పంథాలో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. కేవలం వైసీపీ పై, తన అన్నపై విమర్శలు చేయడమే లక్ష్యంగా షర్మిల కనిపిస్తున్నారు.
తాజాగా విద్యా దీవెన నిధులను నేరుగా విద్యార్థుల తల్లులు ఖాతాలోకి జమ చేయడం ప్రారంభించారు. ఈ నిధులను తల్లిదండ్రులు నేరుగా కాలేజీలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి.. విద్యను అందిస్తున్న తీరును గమనించి.. ఫీజులు చెల్లించాలని.. తద్వారా కాలేజీల దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చని జగన్ చెప్పుకొచ్చారు. దీనిని హైకోర్టు కూడా సమర్థించింది. అయితే చివరలో తల్లిదండ్రులకు జమ చేసిన నిధులు కాలేజీలకు వెళ్లలేదు. దీంతో ఫీజులు కట్టాలంటూ కాలేజీలు ఇప్పుడు కోరుతున్నాయి. వాస్తవంగా ఇది జరిగింది.
కానీ.. షర్మిల ఎల్లో మీడియా ట్రాప్‌లో పడిపోయి.. ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను ఆధారంగా చేసుకుని తన అన్న జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న వాతావరణం ఎక్కువగా కనిపిస్తోంది. షర్మిల సబ్జెక్టు లేకుండా రాజకీయాలు చేయటం.. పసలేని విమర్శలు చేయడం చూస్తే.. ఆమె ఖచ్చితంగా మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఏపీలో దిక్కు మొక్కు లేని కాంగ్రెస్‌కు.. ఇప్పుడు షర్మిల పెద్దదిక్కుగా ఉన్నారు. మరి ఆమె నాయకత్వంలో పార్టీ ముందుకు వెళ్లాలంటే షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై నిజాయితీతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది.