ప్రతి నాలుగు నెలలకు ఒక ఫ్రీ సిలిండర్ పొందే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. మంత్రి వర్గం ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గ్యాస్ వినియోగదారులు సిలిండర్ కు డబ్బులు చెల్లించిన 48 గంటల్లో సిలిండర్ కు సంబంధించిన సబ్సిడీ మొత్తం బ్యాంక్ ఖాతాలలో జమ కానుందని తెలుస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది.
అయితే ఇచ్చే మూడు సిలిండర్లకు కూడా ఇంత కఠిన నియమ నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గొచ్చు కానీ ప్రజల్లో ఒకింత వ్యతిరేకత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి సబ్సిడీ మొత్తాన్ని జమ చేసేలా కూటమి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఈ తరహా నిబంధనల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డ్ ప్రామాణికంగా ఈ స్కీమ్ అమలు కానుంది. ఈ స్కీమ్ అమలు విషయంలో ప్రజల నుంచి ఎలాంటి కామెంట్లు వ్యక్తమవుతాయో చూడాల్సి ఉంది. ఈ స్కీమ్ నియమ నిబంధనల గురించి వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు సూపర్ సిక్స్ ఇతర హామీల అమలు ఎప్పుడని సామాన్యుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.