ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని అందుకు తగ్గట్టుగా పలు రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. గతంలో కేవలం ఒక్క రోజులో గ్రామ సభల పేరిట నిర్వహించిన కార్యక్రమం కూడా గిన్నిస్ రికార్డును అందుకున్నది.3300 గ్రామాలకు పైగా అభివృద్ధి చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈనెల 14న పల్లె పండుగ పంచాయితీ వారోత్సవాలు పేరుతో రాష్ట్రమంతా కూడా పలు రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.



అయితే కొన్ని గ్రామాలలో మాత్రం అసలు ఎలాంటి వాతావరణం కనిపించడం లేదట. గ్రామ సభలకు వచ్చినంత పేరు వీటికి రావడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జనసేన కార్యకర్తలు కూడా రోజుకు ఒక కార్యక్రమం చొప్పున పెట్టడంతో పెద్దగా పట్టించుకోవడంలేదని కేవలం అధికారులు మాత్రమే హాజరవుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వర్షాకాలం కావడం చేత పూర్తిగా అమలు చేయలేదు. దీంతో ఈ కార్యక్రమానికి కూడా కాస్త బ్రేకులు పడ్డాయి.


గ్రామీణ స్థాయిలో రహదారులను నిర్మించాలని వీటికి మాత్రమే శ్రీకారం చుట్టుతోంది కూటమి ప్రభుత్వం. అయితే కొన్ని గ్రామాలలో నిధులు ఉన్న పనులు చేయడానికి ఎవరు ముందుకు రాలేదంట.. అందుకు గల కారణం ఏమిటంటే గతంలో చేసిన పనులకే ఇప్పటివరకు ఎలాంటి డబ్బుని జమా చేయలేదట. ముందు వాటి సంగతి చూడాలంటూ కాంట్రాక్టర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే ఏపీ సర్కారు మాత్రం కేవలం తమ హయాంలో జరిగిన వాటికి మాత్రమే నిధులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే చాలాచోట్ల ఎలాంటి పనులు కూడా ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల జనసేనకు సంబంధించిన వారు మాత్రమే ఈ కార్యక్రమాలను చూస్తున్నారట. మొత్తానికి ఈ పల్లె పండుగ అనే కార్యక్రమం నత్త నడక నడుస్తూ పెద్దగా స్కోప్ లేకుండా చేస్తోందట. మరి ఈ విషయం డిప్యూటీ సీఎం వరకు వెళ్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: