వివరాల్లోకి వెళితే, కల్వకుర్తికి చెందిన వెంటకయ్య అనే వ్యక్తి మద్యం బాగా సేవించి ఆ తర్వాత దోశ తినాలనే కోరికతో స్థానికంగా ఉన్న హోటల్ దగ్గరకి వెళ్ళాడు. దోశ ఆర్డర్ చేసుకొని తిన్నాడు. అయితే, ఈ క్రమంలో దోశ గొంతులో ఇరుక్కుకపోవడంతో ఒక్క సారిగా ఊపిరాడలేదు. కట్ చేస్తే, కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దాంతో హుటాహుటిన అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుప్రతికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుత ఈ ఘటన అందరినీ షాక్‌కు గురి చేస్తున్నది. విషయం బయటకి పొక్కడంతో జనాలు దోశ గొంతులో ఇరుక్కుపోయి చనిపోవడం ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే, ఇలా గతంలో కూడా కేరళలో ఇదే తరహా ఘటన చోటు చేసుకొని, స్థానికులని ఆశ్చర్య పరిచేలా చేసింది. వలయార్‌లో ఇడ్లీలు తినే పోటీలు జరగగా... సుమారు 50 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి పోటీలో పాల్గొని పోటీలో భాగంగా చాలా ఉత్సాహంగా ఇడ్లీలు ఆరగించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతగాడు కాస్త తొందరపడి తింటున్న సమయంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అతన్ని ప్రానాలు కాపాడేందుకు గొంతులో నుంచి ఇడ్లీలను బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.