మనిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. అందుకే గతంలో నీకు ఇస్తున్న వాటాలను రద్దు చేసుకుంటున్నానని లెక్కలో పేర్కొన్నారు. తండ్రి సంపాదించిన వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను ఆయన జీవించి ఉన్నప్పుడే ఇద్దరికీ సమానంగా పంచారు. కానీ.. నా సొంతో పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపారాలకు వారసత్వంతో సంబంధం లేకపోయినా.. నీ మీద ప్రేమతో కొన్ని ఆస్తులు నీకు ఇచ్చానంటూ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో షర్మిలకు రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్టు జగన్ లేఖలో పేర్కొన్నారు.
ఎలాంటి అప్లికేషన్లు లేకపోయినా.. సోదరి షర్మిలపై ఉన్న ప్రేమతోనే తాను ఇలా చేసినట్టు తెలిపారు. అయినా కూడా షర్మిల ఎలాంటి కృతజ్ఞత లేకుండా తనపై విమర్శలు చేయడంతో పాటు.. రాజకీయంగా తనకు ఎదురు రావడంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే చెల్లి షర్మిల ఆలోచన, ప్రవర్తనలో ఏదైనా సానుకూల మార్పులు వస్తే.. కోర్టు కేసులన్నీ పరిష్కారం అయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఎంత చేయాలని అంశాలు పరిశీలిస్తానని కూడా తెలిపారు. ఇక తనకు వైఎస్ అవినాష్ రెడ్డి, తన భార్య భారతికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని కూడా షర్మిలకు జగన్ లేఖలో స్పష్టం చేశారు.