వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించక ముందే తన పిల్లలకు ఆస్తులు పంచేసారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ బంజర హిల్స్ రోడ్ నెంబర్ 2 లో 280 గజాల స్థలం పని చేశారని వివరించారు. ఇడుపులపాయలు 51 ఎకరాల పొలం కూడా ఉందని తెలిపారు.
అదే సమయంలో సండూరు పవర్ కంపెనీలో వాటా కూడా ఉందని ఈ వివరించారు పేర్ని నాని. స్వాతి పవర్ హైడ్రో ప్రాజెక్టు లో కూడా వాటా ఉందని వివరించారు. విజయవాడలోని రాజు యువరాజు థియేటర్ లో కూడా వాటా ఉందని.... పేర్ని నాని చెప్పడం జరిగింది. పులివెందులలో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలను వైయస్ షర్మిలకు ఆనాడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పగించినట్లు తెలిపారు.
కానీ ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఇదంతా టిడిపి నేతల బాగోతం అని... వాళ్లు ఆడించినట్లు వైయస్ షర్మిల ఆడుతున్నారని ఆగ్రహించారు. రాజకీయంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక.... తన కుటుంబ సభ్యులతో దెబ్బతీస్తున్నారని చంద్రబాబు పై కూడా నిప్పులు జరిగారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దారుణం అన్నారు.