గులాబీ పార్టీ నుంచి గెలుపొందిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చి... తన అనుచరులను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని... జీవన్ రెడ్డి అంటున్నారు. అంతేకాదు తన అనుచరుడు మరణించిన రోజు... రోడ్డు పైన బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కూడా చేశారు. ఈ హత్యకు కుట్ర చేసింది సంజయ్ కుమార్ అని... బహిరంగంగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ కూడా రాశారు. నన్ను సాదుకుంటారా లేదా సంపుకుంటారా అంటూ సోనియాగాంధీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారిపోయాయి. ఇక అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోలేదని తేల్చి చెప్పారు. గులాబీ పార్టీకి రాజీనామా చేయలేదని కూడా వివరించారు. దీంతో సంజయ్ కుమార్ మళ్ళీ గులాబీ గూటికి వెళ్తారా అని చర్చ జరుగుతుంది.
కెసిఆర్ ఆడిన.. నాటకంలో భాగంగానే సంజయ్ కుమార్ ను... కాంగ్రెస్ పార్టీలోకి పంపారా అని కూడా కొత్త చర్చ జరుగుతోంది. మర్డర్ కేస్ అయిపోయిన తర్వాత మళ్లీ.. గులాబీ గూటికి సంజయ్ కుమార్ వస్తారని... చెబుతున్నారు. అయితే మరి కొంతమంది... సంజయ్ కుమార్ ను అసలు పార్టీలోకి తీసుకోకూడదని డిమాండ్ చేస్తున్నారు. గులాబీ పార్టీలో చాలా మంది యంగ్ లీడర్స్ ఉన్నారని... వారిలో ఒకరిని ఎమ్మెల్యే కాండేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.