ఇక ఇదే విషయమై, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైనా కూడా జగన్ మమ్మల్నే నిద్రిస్తుండడం కాస్త కామెడీగా ఉందని అన్నారు. అసలు దీంతో మాకేం సంబంధం? అంటూ బాబు రియాక్ట్ కావడం ఇపుడు చాలా ఆసక్తికరంగా మారింది. కాగా మాజీ మంత్రి పేర్ని నాని.. ఈ వ్యవహారంపై స్పందిస్తూ... ఇలాంటి చెల్లి ఉంటే ఏ అన్నకైనా ఇబ్బందులు తప్పవన్నట్లుగా చెపుకు రావడం కొసమెరుపు. ఇక ఆ మధ్యలో జగన్-షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల తగాదాలు, కోర్టు పిటిషన్లు, లేఖలు వంటివి సాక్షి మీడియాలో ప్రత్యక్షం కావడం గమనార్హం. ఈ సందర్భంగా.. షర్మిలపై పలు ప్రశ్నల వర్షం కురిపించింది.
ఈ సందర్భంగా ఆమె అన్నకు సంధించిన ప్రశ్నలు ఏమిటంటే... "ఈడీ 2016లో ఎటాచ్ చేసిన సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని భ్రమ పడుతున్న జగన్... 2019లో 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా చెబుతూ, ఎంవోయూపై ఎలా సంతకం చేశారు? అప్పుడు బెయిల్ మీ బుర్రకు గుర్తుకురాలేదా?" "క్లాసిక్, సండూరులో ఉన్న కంపెనీ షేర్లను రూ.42 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2021లో తల్లి విజయమ్మకు అనుమతి ఇచ్చినప్పుడు బెయిల్ సంగతి మీ మట్టి బుర్రకు గుర్తుకు రాలేదా? ఇక అదే ఏడాది జగన్, ఆయన భార్య షేర్లపై సంతకం చేసి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు కూడా బెయిల్ సంగతి గుర్తుకురాలేదా?” అంటూ సూటిగా ప్రశ్నించారు షర్మిళ. దాంతో జగనన్నకు బుర్ర గిర్రున తిరిగినట్టు అయింది.