తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.. టిడిపి ఈసారి అధికారంలోకి వచ్చింది చాలా కష్టపడి మరి ఐదేళ్లపాటు పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ ఈసారి విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నారు.. చంద్రబాబు తనయుడు లోకేష్ మంత్రి గా కీలక బాధ్యతలలో ఉన్నారు. టిడిపి ఈసారి అధికారంలో ఉండడంతో సభ్యత్వ నమోదు కూడా అదిరిపోయేలా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే గాజువాక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే బాబుకు ఊహించిన రీతిలో పెద్ద గిఫ్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు.


గాజువాకలో మొత్తం 80 వేల సభ్యత్వాలను నమోదు చేసి జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు కు బహుమతి గా ఇస్తానని శ్రీనివాసరావు చెబుతున్నారు. గాజువాక నియోజకవర్గం లో మొత్తం 2 లక్షలకు పైగా ఓటర్ లు ఉన్నారు. ఇందులో 80 వేల సభ్యత్వం అంటే దగ్గర్లో దగ్గర సగానికి సగం ఓటర్లు టిడిపి సభ్యులుగా అధికారికంగా అయినట్టే. అలా వీల‌వుతుందా ? అన్న ప్రశ్నకు పల్లా శ్రీనివాసరావు ధీమాగా ఆన్సర్ చేస్తున్నారు. గాజువాకలో వైసిపి , జనసేన కూడా బలంగా ఉంది. వామపక్షాలు కూడా ఎంతో కొంత పట్టు సాధించి ఉన్నాయి .. పైగా స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు . ఇక్కడ నార్త్ ఇండియా జనాలు ఎక్కువగా ఉండడంతో బిజెపికి కూడా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది .


ఈ పరిస్థితులలో గాజువాకలో సగానికి సగం టిడిపికే వాటా అంటే పల్లా శ్రీనివాసరావు చాలా కష్టపడాల్సి ఉంది. అయితే అది ఏపీ టీడీపీ అధ్యక్షుడు నియోజకవర్గం అందుకే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావు క్యాడర్‌ను కోరుతున్నారు. నిజంగా అలా జరిగితే కనుక గాజువాక టిడిపి హిస్టరీలో ఉండిపోతుందని చెప్పాలి .. ఆ స్థాయిలో సభ్యత్వం జరిగితే వచ్చే ఎన్నికలలోను కచ్చితంగా టీడీపీ ఘనవిజయం సాధించి తీరుతుంది. అయితే 80, 000 సభ్యత్వాలు అంటే ఆషామాషీగా తీసుకోకూడదు. చాలా పట్టుదలగా తీసుకొని చేయాల్సి ఉంది.. మరి పల్లా శ్రీనివాసరావు గాజువాకలో ఏ స్థాయిలో సత్తా చాటి చంద్రబాబుకు బంపర్ గిఫ్ట్ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: