తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి... కచ్చితంగా ఓవైసీ సపోర్ట్ చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో... కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున అండగా నిలిచింది మజిలీస్ పార్టీ. నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీకి.. పనిచేసిన ఏకైక పార్టీ ఓవైసీదే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత... కాంగ్రెస్ పార్టీ కనుమరుగే ప్రమాదం ఉందని గ్రహించి... కెసిఆర్ కు జై కొట్టారు.
అయితే ఇప్పుడు అదే... ఎంఐఎం పార్టీ కొంప ముంచేలా కనిపిస్తోంది. ఎంఐఎం పార్టీకి అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ.. వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల దగ్గర వస్తున్న నేపథ్యంలో.. ఎంఐఎం పార్టీని దూరం పెట్టిందట కాంగ్రెస్. తెలంగాణలో వ్యవహరించిన తీరును బట్టి... కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందట. గతంలో కేసీఆర్కు అనుకూలంగా ఉన్న ఎంఐఎం పార్టీని దూరంగా పెట్టాలని... సోనియా గాంధీ కూడా నిర్ణయం తీసుకున్నారట. అలా కేసీఆర్ వల్ల ఇప్పుడు ఎంఐఎం పార్టీ... ప్రమాదంలో పడ్డట్టు చెబుతున్నారు.