ఈరోజు ఉదయం సాక్షి పేపర్ చూశాను.. అందులో ఏది వచ్చిన చాలామంది నమ్ముతూ ఉంటారు. వైయస్సార్ అభిమానులు కూడా అసలు వాస్తవాలు తెలుసుకోవాలి.. అమ్మ వైయస్ విజయమ్మ నాన్న రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు.. అందులో ప్రత్యేకించి తనకోసం ఒక మాట రాశారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారికి లోకమంతా ఒక ఎత్తు అయితే తన బిడ్డ షర్మిలా మాత్రం ఒక ఎత్తు అంటూ తెలిపారు.. నాన్నకు తాను అంటే చాలా ఇష్టమని తనను ఎప్పుడూ కూడా ఆడపిల్ల కథ అని చిన్న చూపు చూడలేదని నాన్న బతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట చెప్పేవారని తన నలుగురు చిల్డ్రన్స్ కి సమానంగానే ఆస్తిని పంచాలి అని చెప్పేవారట.
రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కూడా తమ కుటుంబ సభ్యులకు చెందాలని అవి జగన్మోహన్ రెడ్డి సొంతం కాదు అంటూ తెలిపింది. ఈ విషయం అటు ఆయన బిడ్డలైన మాకు భార్య ఆయన విజయమ్మకు సన్నిహితులకు తెలుసు అంటూ తెలిపింది. అలాగే అన్ని వ్యాపారాలలో సరస్వతి, సాక్షి మీడియా, భారతి సిమెంట్, యాలవంక ప్రాపర్టీ, క్లాసిక్ రియాలిటీ ఇతరత్రా ప్రాపర్టీలలో నలుగురు చిల్డ్రన్స్ కి కూడా సమాన వాటా ఉందని తెలిపింది.
ఇక రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదని ఆయన హఠాత్తుగా మరణించినప్పుడు కూడా ఆస్తి పంపకాలు ఎక్కడ జరగలేదని.. ఇప్పటివరకు తనకు రావాల్సిన ఏ ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదని తెలుపుతోంది. తాను జగన్మోహన్ రెడ్డి ఆస్తులలో వాటా అడుగుతున్నాననేది చాలా నవ్వుగా ఉంది.. కేవలం తన నలుగురు చిన్న బిడ్డలకు అన్ని ఆస్తులను సమానంగా పంచాలని తెలుపుతుంది. నాకంటూ వ్యక్తిగతంగా ఆస్తులపైన ఎలాంటి ఆశ లేదు.. కోరిక లేదంటూ తెలిపింది.
అయితే ఈ విషయం విన్న వైయస్సార్ అభిమానులు సైతం.. షర్మిలను ఒకే ప్రశ్న వేస్తున్నారు.. ఇన్ని చెప్పావు కదా.. అన్న కంటే నీకు ఆస్తి ఎక్కువా.. అయ్యిందా.. డబ్బు ముందు ముకారం ఎటు పోయింది అంటూ ప్రశ్నిస్తున్నారు..