సరైన సమయంలో సరైన మెంటరింగ్ లేకపోవడం వల్లే ఎక్కువ సంఖ్యలో స్టార్టప్స్ ఫెయిల్ కావడం జరుగుతోందని జేఏ చౌదరి అన్నారు. లోకల్ మెంటర్స్ స్టార్టప్ లను పూర్తిస్థాయిలో సక్సెస్ చేయడానికి అవసరమయ్యే సలహాలు, సూచనలను అందించడంలో ఫెయిల్ అవుతున్నారని స్టార్టప్స్ సక్సెస్ కావాలంటే అనుభవం, పూర్తిస్థాయిలో పరిజ్ఞానం ఉన్న మెంటర్స్ అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రతి స్టార్టప్ కు మంచి మెంటర్ ను అందించడం ద్వారా స్టార్టప్స్ సులువుగా సక్సెస్ అవుతాయని అలా జరగకపోతే ప్రాడక్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నా సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు. ప్రతి వారం గంట సమయం పాటు సమస్యలు తెలుసుక్ని పరిష్కారాలను చూపిస్తూ స్టార్టప్స్ లను ఐఎస్ఎఫ్ సహాయంతో సక్సెస్ కావచ్చని కొంతమంది మెంటర్స్ ఫండింగ్ విషయంలో తమ వంతు సహాయసహకారాలు అందిస్తారని జేఏ చౌదరి తెలిపారు.
మెంటర్స్ తమకు ఉన్న పరిచయాల ద్వారా ప్రాడక్ట్ మార్కెట్ సైతం పెరిగేలా చేయగలరని ఆయన తెలిపారు. ఏఐ వల్ల ఎక్కువమంది ఉద్యోగాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రతి వారంలో ఒక గంట సమయం కేటాయిస్తే కోరుకున్న విజయం సులువుగా దక్కుతుందని జేఏ చౌదరి పేర్కొన్నారు. ఈ యజ్ఞంలో చాలామంది సమిధలు అవుతారని ఆయన పేర్కొన్నారు. మన దేశ ఉత్పత్తులు గ్లోబల్ ఉత్పత్తులగా మారే రోజులు రాబోతున్నాయని జేఏ చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్ లకు చేయూతనిచ్చేలా జేఏ చౌదరి వేస్తున్న అడుగులపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.