ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ పరిస్థితి... అత్యంత దారుణంగా తయారైన నేపథ్యంలో... జగన్మోహన్ రెడ్డిని కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. తన సొంత చెల్లె వైయస్ షర్మిల నుంచి మళ్లీ... జగన్మోహన్ రెడ్డికి అవమానాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకాల విషయమే హాట్ టాపిక్ అయింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో... వాటాల విషయంలో... జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైయస్ షర్మిల మధ్య వివాదాలు తలెత్తాయి.

 దీంతో ఒకరి పైన ఒకరు కేసులు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రోజులుగా... వైయస్ షర్మిల అలాగే జగన్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో కొనసాగుతోంది. అయితే షర్మిల బాధ నుంచి తప్పించుకునేందుకు... తాజాగా వైసీపీ స్కెచ్ వేసింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు.... అదే స్కెచ్ను సూచిస్తున్నాయి. ఆస్తుల్లో వాటా ఉంటే... వైయస్ షర్మిలపై కేసులు ఎందుకు పెట్టలేదని... గతంలో జగన్మోహన్ రెడ్డి పైన మాత్రమే... ఎందుకు కేసులు పెట్టారని కొత్త పాయింట్ లేవనెత్తారు సుబ్బారెడ్డి.

 ఆస్తులలో లీగల్ గా షర్మిలకు వాటా ఉంటే... ఈడి అలాగే సిబిఐ అధికారులు... జగన్ పైన పెట్టినట్లుగానే కేసులు పెట్టాలి కదా? షర్మిలపై ఎందుకు.. అధికారులు కేసు పెట్టలేదని నిలదీశారు. జగన్ మాత్రమే 16 నెలల పాటు జైలు శిక్ష ఎందుకు అనుభవించాడు ? నిజంగానే షర్మిలకు ఆస్తుల్లో వాటా ఉంటే... అప్పుడే షర్మిల కు 16 నెలల జైలు శిక్ష పడేదని... పరోక్షంగా వైవి సుబ్బారెడ్డి  చెప్పే ప్రయత్నం చేశారు.

 అప్పుడు కూడా కేసులు పెట్టింది కాంగ్రెస్ అలాగే తెలుగుదేశం పార్టీల లీడర్లేనని ఆరోపణలు చేశారు. ఇవాళ స్టేటస్ కో ఉన్న ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసి జగన్ ను ఇబ్బంది పెట్టాలని... టిడిపి కుట్రలో షర్మిల కూడా భాగం అయ్యారని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి రాకూడదని... కాబట్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు ఫైల్ చేయాల్సి వచ్చిందని... సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అయితే సుబ్బారెడ్డి వ్యాఖ్యలను చూస్తే... మనకు ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అప్పట్లో.. అక్రమంగా ఆస్తులు సంపాదించాడని జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాడు. కానీ షర్మిల మాత్రం వెళ్లలేదు.  అంటే అప్పటికే వైయస్ రాజశేఖర్ రెడ్డి...  ఆస్తులన్నీ కొడుకు అలాగే కూతురుకు పంపిణీ చేసేసారని... వైసీపీ చెబుతోంది అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: