ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ షో సీజన్4 లో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నా అరెస్ట్ ఘటనను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. నేనెప్పుడూ తప్పు చేయలేదని నిప్పులా బ్రతికానని ఆయన కామెంట్లు చేశారు. తప్పకుండా ప్రజలు మద్దతు ఇస్తారనే విశ్వాసంతో ఉనననని చంద్రబాబు వెల్లడించారు. ఆ నమ్మకమే మళ్లీ నన్ను గెలిపించిందని పేర్కొన్నారు. నన్ను ప్రజల ముందు నిలబెట్టిందని బాబు పేర్కొన్నారు.
 
అరెస్ట్ చేస్తారనో, ప్రాణం పోతుందనో భయపడితే లక్ష్యాన్ని నెరవేర్చలేమని నా లైఫ్ లో ఎన్నడూ రాజకీయ కక్షతో వ్యవహరించలేదని ఆయన కామెంట్లు చేశారు. గతంలో నేను సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో గొడవలు చేస్తూ రెచ్చిపోయినా కూడా సంయమనం పాటించేవాడినని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైఎస్సార్ సీఎం అయ్యాక ప్రతిపక్ష నేతగా ఉన్న నాపై దూకుడుగా మాట్లాడితే హెచ్చరించేవాడినని బాబు తెలిపారు.
 
వైఎస్సార్ తగ్గి క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని బాబు తెలిపారు. ఏపీలో తొలిసారి కక్షపూరిత రాజకీయాలు వచ్చాయని వ్యక్తిగత ద్వేషాలకు తెర లేపారని అయినా సరే నేను లక్ష్మణ రేఖ దాటనని తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని తప్పు చేయని వారి జోలికి వెళ్లనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నా లైఫ్ లో నేను దేనికీ భయపడనని చంద్రబాబు పేర్కొన్నారు.
 
నా అరెస్ట్ జరగకపోయినా పొత్తు ఉండేదేమో అని బాబు తెలిపారు. నా అరెస్ట్ ఆ నిర్ణయానికి ఊతమైందని ప్రజల ఆకాంక్షను సరైన సమయంలో పవన్ ప్రతిబింబించారని బాబు చెప్పుకొచ్చారు. మనం నిమిత్తమాత్రులమని విధి స్పష్టంగా ఉంటుందని బాబు తెలిపారు. నన్ను శారీరకంగా దెబ్బ తీయలేక మానసికంగా దెబ్బ తీశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్ స్టాపబుల్ షోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని సమాచారం అందుతోంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: