ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫుల్ జోష్ లో ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఎక్కడ తగ్గేది లేదన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. అయితే... ఇలాంటి నేపథ్యంలో... నారా చంద్రబాబు నాయుడు... కాస్త రిలాక్స్ అయ్యేందుకు... అన్ స్టాపబుల్ షో లో సందడి చేశారు. ఈ అదిరిపోయే షోకు నందమూరి బాలకృష్ణ పోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే.


ఇప్పటికే ఈ సీజన్ మూడు భాగాలుగా రిలీజ్ అయింది. ఈ మూడు భాగాలు సక్సెస్ఫుల్ కావడంతో సీజన్ 4 ప్రారంభించారు. అయితే సీజన్ ఫోర్ మొదటి ఎపిసోడ్ నారా చంద్రబాబు నాయుడు తో ప్రారంభం కావడం జరిగింది. అయితే.. ఈ సీజన్ ఫోర్ ఎపిసోడ్ మొదటి భాగంలో... నందమూరి బాలయ్య అలాగే నారా చంద్రబాబు నాయుడు మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. నందమూరి బాలకృష్ణ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు... అదిరిపోయే ఆన్సర్లు ఇచ్చారు.


ఇప్పుడు ఈ షో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ షో సందర్భంగా... చంద్రబాబు నాయుడు కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. మీ ఇంట్లో... నారా భువనేశ్వరి ది  మాటచెల్లుతుందా ? లేదా మీ కోడలు నారా బ్రాహ్మిని  మాట చెల్లుతుందా అని చంద్రబాబును బాలయ్య బాబు అడిగారు. మీ ఇంట్లో ఎవరు బాస్ అంటూ ప్రశ్నించారు. అయితే దీనికి చాలా.. తెలివిగా ఆన్సర్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.


నా ఇంట్లో నాకు నారా భువనేశ్వరి బాస్ అని తెలిపారు. నారా లోకేష్ కు... ఆయన భార్య బ్రాహ్మిని.. లేడీ బాస్ అని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ ఆన్సర్ తో... నందమూరి బాలయ్య తో పాటు... షో చూసేవారు కూడా ఆశ్చర్యపోయారు.  నారా చంద్రబాబు నాయుడు..  రాజకీయాల్లో పన్నె వ్యూహాలను ఈ షోలో... అమలు చేశారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తన జైలు జీవితాన్ని గురించి కూడా.. ఈ షోలో చంద్రబాబు నాయుడు పంచుకొని బాధపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: