ఇక ఈ ఎపిసోడ్ లో ... చంద్రబాబు తన పర్సనల్ విషయాలు, జైలు జీవితం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వము ముందు ఉన్న సవాళ్ళ గురించి మాట్లాడారు. ముఖ్యంగా... జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు... తనను అరెస్టు చేయడంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. తాను నంద్యాలలో మీటింగ్ పెడుతున్న సమయంలోనే.. అప్పటి అధికారులు హడావిడి చేసి తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.
తనకు ఎలాంటి నోటీసు లేదా అరెస్టు వారెంటు లేకుండానే... అరెస్టు చేయడం జరిగిందని కూడా గుర్తు చేసుకున్నారు. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగితే కూడా.. వాళ్లు తనకు నరకం చూపించారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దౌర్జన్యంగా అర్ధరాత్రి తనను జైలుకు తీసుకువెళ్లారని కూడా వెల్లడించడం జరిగింది. ఆ క్షణం గుర్తు చేసుకుంటే ఇప్పటికి కూడా తన గుండె తరుక్కుపోతుందని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రజాస్వామ్యంలో.. ఒక రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా ఇలా జరగలేదని తెలిపారు. అయితే అదే సమయంలో తాను.. భయపడలేదని కూడా తెలిపారు. తనకు కూడా ఒక రోజు వస్తుందని... ఇప్పుడు.. ఆవేశపడకుండా ఆలోచన చేయాలని డిసైడ్ అయినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. తాను గతంలో అలాగే ఇప్పుడు ఎక్కడ కూడా తప్పు చేయలేదని వివరించారు. తన జైలు జీవితం గురించి ఎవరైనా పుస్తకం రాయచ్చు.. అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు.