సిట్ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సమయంలో ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు కామెంట్లు చేశారు పవన్ దీక్ష చేపట్టడం గురించి బాబు మాట్లాడుతూ ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయని ఒక సీఎంగా అందరి నమ్మకాలను కాపాడే బాధ్యత నాపై ఉంటుందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అపచారం జరగకుండా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పాలన సాగించడమే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
సైబరాబాద్ ను నేను అభివృద్ధి చేశానని ఆర్థిక హబ్ గా తయారు చేయడానికి ఛాన్స్ వచ్చిందని తెలిపారు. ఈరోజు హైదరాబాద్ మహానగరంగా దేశానికే నంబర్ వన్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారని గత పాలకులెవరూ నాశనం చేయలేదని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోని ఐదు నగరాలలో అమరావతిని ఒకటిగా చేయాలని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం.
చంద్రబాబు అన్ స్టాపబుల్ షో సీజన్4 ను సక్సెస్ చేయడంలో పూర్తిస్థాయిలో సఫలమయ్యారు. నా ఛాయిస్ అమరావతి అయినప్పటికీ విశాఖ, విజయవాడలను కూడా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఎన్నో సవాళ్లు ఉన్నాయని అప్పులు తీర్చాలని వడ్డీలు చెల్లించాలని బాబు తెలిపారు. వరదల్లో కొంతమంది బాధలను చూసి నేను చలించిపోయానని బాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందడుగులు వేస్తుండటం గమనార్హం. చంద్రబాబు చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.