ఈ విషయం సీఎం వరకు వచ్చింది. దీనికి కారణమైన ఓ మంత్రికి చంద్రబాబు గట్టిగానే చెప్పారట. ఇక, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి+ప్రస్తుత యువ మంత్రి కూడబలుక్కుని వ్యాపారాలు చేస్తున్నార న్నది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. యువ మంత్రికి వ్యాపారాలు కొత్తకాదు. కానీ, ఇప్పుడు చేస్తున్నది వేరని.. నిన్న మొన్నటి వరకు తమకు వ్యాపార పరంగా పోటీ ఇచ్చిన వారికి ఇప్పుడు ఆయన పరోక్షంగా వార్నింగులు ఇస్తున్నారని.. దీనికి మాజీ మంత్రి కూడా దోహదపడుతున్నారన్నది కంప్లెయింట్.
ఏలూరు జిల్లాలో మంత్రి ఒకరు బాగానే పనిచేస్తున్నా.. ఆయన సున్నితత్వం.. ఇతర నేతలకు అవకాశం గా మారిందనే వాదన ఉంది. దీనిపైనా చంద్రబాబు కొంత కటువుగానే స్పందించారని తెలిసింది. మీరు మరీ అంత మెత్తగా ఉంటే.. కష్టం. చెడ్డపేరు మీకు కానీ.. వారికి కాదు.. అంటూ వార్నింగ్ ఇచ్చిన స్థాయిలో చెప్పినట్టు సమాచారం. ఇంతకీ ఈ మంత్రి చేసింది.. ఏంటంటే..ఇసుక విషయంలో ఉన్న తన వారిని చూసీ చూడనట్టు వదిలేయడమే!
ఉమ్మడి కృష్నా జిల్లాకు చెందిన మరో మంత్రి మద్యం వ్యవహారంలో తన వారితోపాటు.. వైసీపీ వారికి కూడా గేట్లు ఎత్తేశారట. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఆయన నిత్యం వైసీపీ పై విమర్శలు గుప్పిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో అదే పార్టీ కీలక నేతలకు సహకరిస్తున్నారట. ఇలా.. ఒక్కొక్కరిదీ ఒక్క రీతిగా ఉండడంతో ఒక్కొక్కరిని పిలిచి కాకుండా.. గుంపుగానే చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. అయితే.. సీన్ కట్ చేస్తే.. తెలిసిందేంటేంటే.. ఇవన్నీ తమకు మామూలేనని, బాబు ను పట్టించుకుంటే అన్నీ చేయలేమని వారు ముక్తాయించడం!! ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవమని అత్యంత విశ్వసనీయ నాయకులే చెబుతున్నారు.
: