ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లాలోని యాచవరం మండలంలో ఉండేటువంటి సరస్వతి పవర్ సంస్థకు చెందిన  భూములలో అటవీ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయని అనుమానం ఉండడంతో వాటికి సంబంధించి పూర్తి విస్తరణ ఎంత ఉందో నివేదిక ఇవ్వాలంటు ఫారెస్ట్ అధికారులకు సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారట. సరస్వతి పవర్ ప్లాంట్ సంస్థకు కేవలం 1515.93 ఎకరాల ప్రకృతి సంపద వాగులు వంకలు మిగతా భూములు ఉన్నాయని సమాచారం.


ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంతో పలు రకాల చర్చలు కూడా జరిపి ఆ సంస్థకు చెందిన భూములలో ప్రభుత్వ భూములు ఎంత ఉంది జల వనరుల భూమి ఏ మేరకు ఉన్నదని విషయంపై ఫారెస్ట్ అధికారులను సమగ్రంగా పరిశీలించారని జీవోను జారీ చేశారట. అయితే వంకలు కొండలు వాగులు ఉండడం వల్ల పర్యావరణ అనుమతులు ఏ విధంగా ఇచ్చారో తెలియజేయాలి అంటూ పవన్ కళ్యాణ్ పిసిబి ని కోరారు. ఈ అంశం పైన అటు రెవెన్యూ, అటవీ ,PCB అధికారులతో త్వరలోనే భేటీ కాబోతున్నారట.


సరస్వతి పవర్ కు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు షర్మిల గత రెండు రోజుల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే అప్పట్లో సరస్వతి పవర్ పేరుతో రైతుల దగ్గర నుంచి 3 లక్షలకే భూమిని కొనుగోలు చేశారట ఇలా మొత్తం మీద 1515.93 ఎకరాలు భూమి ఉన్నదని.. అయితే ఈ భూముల విలువ ఇప్పుడు 200 కోట్లు ఉన్నదని ఇందులో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని.. అందుకే సరస్వతి పవర్ ని అడ్డుపెట్టుకొని వీటిని కొనుగోలు చేశారని దీని విలువ ఇప్పుడు సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: