యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేవర. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ గత నెలలో పాన్ ఇండియా చిత్రంగా దేశవ్యాప్తంగా తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజే రూ. 172 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. లాంగ్ రన్ లో రూ. 600 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.


దేవర సినిమా విడుదలరోజే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఈ సినిమాపై వ్యతిరేక ప్రచారం జరిగినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాస్ లో తనకున్న క్రేజ్ తో తన స్టామినాతో సినిమాను బ్లాక్ బస్టర్ చేశాడు. ఇదిలా ఉండగా.... దేవర టైటిల్ వివాదం గతంలో జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు బండ్ల గణేష్ రచ్చ చేశాడు. గతంలోనే దేవర సినిమా టైటిల్ ని బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం రిజిస్టర్ చేయించినట్లుగా తెలిపారు.


ఎన్టీఆర్ 30వ సినిమాకు టైటిల్ దేవర అని అనౌన్స్ చేసిన తర్వాత గతంలో ఈ టైటిల్ గురించి బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో దానిని గుర్తు చేస్తూ ఓ నెటిజన్ ఎన్టీఆర్ 30 దేవర టైటిల్ ఎలా ఉంది అని అడిగారు. దీనికి బండ్ల గణేష్ సమాధానం ఇస్తూ.... దేవర పేరును నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను దాని రెన్యువల్ చేయించడం మర్చిపోవడం వల్ల నా టైటిల్ మీరు కొట్టేశారు అని సోషల్ మీడియాలో పోస్ట్‌  చేశాడు.


అయితే ఈ సోషల్ మీడియాలో పోస్ట్‌  పై ఎన్టీఆర్ అభిమానుల నుంచి నెగిటివ్ గా కామెంట్లు రావడంతో మళ్లీ నాకు ఏమీ ఇబ్బంది లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే అని సోషల్ మీడియాలో పోస్ట్‌  చేశాడు బండ్ల గణేష్‌. ఇప్పటికి కూడా ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: