ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాజిటివ్ గా జరిగితే తమ ఘనత అని నెగిటివ్ గా జరిగితే జగన్ సర్కార్ చేసిన పాపమని కూటమి ప్రచారం చేసుకుంటోంది. డిస్కమ్ లకు సర్దుబాటు ఛార్జీలకు ఏపీ సర్కార్ అనుమతులు ఇవ్వడంతో నవంబర్ 1వ తేదీ నుంచి భారీగా కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి.
 
ఏపీ ప్రజలపై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా భారం పడబోతుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే జగన్ సర్కార్ చేసిన తప్పుల వల్లే ఈ ఛార్జీలను విధించాల్సి వస్తుందని చెప్పే విధంగా కొన్ని కథనాలు టీడీపీ అనుకూల పత్రికలలో కనిపిస్తున్నాయి. అయితే ప్రజలకు ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం కూటమి పాలనలోనే తమపై భారం పడిందని నమ్ముతారనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహం అయితే అక్కర్లేదని చెప్పవచ్చు.
 
సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వమే చెల్లించి ప్రజలపై భారం పడకుండా చూస్తే బాగుంటుందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ కామెంట్ల గురించి ప్రభుత్వం ఆలోచన ఏంటో తెలియాల్సి ఉంది. భారీగా ఛార్జీలు పెరిగితే మాత్రం కూటమి సర్కార్ పై విమర్శలు తప్పవని చెప్పవచ్చు. జగన్ సర్కార్ పాలన నచ్చకపోవడం వల్లే ఏపీ ప్రజలు కూటమి సర్కార్ కు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
 
కూటమి సర్కార్ రాబోయే రోజుల్లో సైతం జగన్ సర్కార్ ను నిందించే విధంగా వ్యవహరిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని చెప్పవచ్చు. కూటమి సర్కార్ భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. కూటమి సర్కార్ భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి సర్కార్  పాలన విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు.





మరింత సమాచారం తెలుసుకోండి: