ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ ఆస్తులకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయం పైన అటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించడం జరిగింది.


ఈ సందర్భంగా జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పైన పలు వ్యాఖ్యలు చేస్తూ ఫైర్ అయ్యారు.. ఇంకా జగన్ను ఏం చేయాలనుకుంటున్నారనే విధంగా సూటి ప్రశ్నను అడగడం జరిగింది.. జగన్ ని జైలుకు పంపించడానికి కుట్ర చేస్తున్నారా అనే విధంగా కూడా ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ఈడి అటాచ్ చేసినటువంటి ఆస్తుల విషయంలో ఎవరూ కూడా జోక్యం చేసుకోకూడదనే విషయం మీకు తెలియదా అలాంటప్పుడు అలా అటాచ్ చేసిన ఆస్తులను షర్మిల ఎందుకు బదిలీ చేశారు అంటూ ప్రశ్నించారు.. ఇదంతా కూడా కొడుకుని ఇబ్బంది పెట్టాలనే కదా అంటూ విజయమ్మ పైన కూడా ప్రశ్నల వర్షం కురిపించారు కేతిరెడ్డి.


కొడుకును ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎవరు నాశనం అవుతున్నట్టు అది మీ వారసుడే కదా అంటూ తెలిపారు.. ఎన్నికల ముందు చూస్తే ఒక వీడియోను విడుదల చేసి అందరినీ నాశనం చేశారు.. ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టు వెళ్లి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులను బదిలీ చేస్తే జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యేది.. అయితే ఈ విషయాన్ని ముందుగానే జగన్ గుర్తించి నెక్స్ట్ స్టెప్పు తీసుకోవాలి కాబట్టి అలా కేసు వేశారు అనే విధంగా తెలిపారు..


చివరికి ఇదంతా చూస్తూ ఉంటే రజనీకాంత్ పెద్దరాయుడు సినిమాలో చెల్లెమ్మ ఇవి తీసుకో అవి తీసుకో అంటున్నప్పటికీ ఈవిడేమో బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పొడిచినట్లుగా పొడుస్తోంది అనే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: