చంద్రబాబు ఎంత చెపుతున్నా... టీడీపీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం లో కనిపిస్తోంది. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఇది నిజం. చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక అంశాల్లో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయి.. అది అంతి మంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సార్లు.. చంద్రబాబు ఈ విషయంపై తమ్ముళ్లకు హెచ్చరికలు జారీ చేసినా చాలా మంది లైట్ తీస్కొన్నారు. అటు దాదాపు ప్రతి కేబినెట్ మీటింగ్‌లోనూ.. మంత్రులకు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెపుతూ వస్తున్నారు. మంత్రులు.. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు అందరూ కూడా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలంటూ.. ఆయన పదే పదే నూరిపోస్తున్నారు.
పై నుంచి ఎంత కంట్రోల్ ఉన్నా కూడా లోకల్ గా మాత్రం ఎమ్మెల్యేల దూకుడు ఆగడం లేదు. దీనిపై పదే పదే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నారట.. ఈ కమిటీ లో సీనియర్లు, మంత్రులు ఉంటారు. ఈ కమిటి లో ఉన్న వారు తీవ్ర ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి కాన్ సంట్రేషన్ చేస్తారని సమాచారం. అదే సమయంలో వీరు ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ వస్తూ ఉంటారు.
ఇలా ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ? వారి ఆదాయాలు.. వ్యయాల తో పాటు పనితీరు ఎలా ఉంది.. ప్రజల్లో ఎలాంటి గుర్తింపు ఉందనే విషయాలను ఎప్పటికప్పుడు చర్చించు కుంటూ ఉంటారట. ఎవరైనా ప్రజల్లో బాగా వ్యతిరేకత తెచ్చుకుంటే ఆ విషయాన్ని చంద్రబాబు కే చెప్పి వారికి వార్నింగ్ ఇప్పిస్తారని పైకి టాక్.. అయితే వాస్తవంగా ఇది సాధ్యం కాదు... ఎందుకంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సీనియర్ మోస్ట్ నాయకులే చాలా మంది ఉన్నారు.
అందుకే.. చంద్రబాబు పదే పదే చెబుతున్నా ఎవ్వరూ కూడా ఆయన మాట పట్టించు కోవడం లేదు. మరి చంద్రబాబు వేస్తోన్న ఈ కొత్త ఎత్తు ఎంత వరకు సక్సెస్ అవుతుందో ? చూడాలి.