- రెవెన్యూ శాఖ నుంచి సీఎస్ కు వెళ్లిన ప్రతి పాదనలు .. ?
- ( హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . .
ప్రముఖ సినీ నటుడు నందమూరి నటసింహం హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. బాలకృష్ణ సినిమా స్టూడియో కోసం ప్రభుత్వం భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగే క్యాబినెట్ మీటింగ్ లో బాలకృష్ణకు భూమి కేటాయించే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతుందట. బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులు విషయం పై రెవెన్యూ శాఖ నుంచి ఎప్పటికే తెలంగాణ సీఎస్ కు ప్రతిపాదనలు వెళ్లాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు బాలయ్య ఏపీ - తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ స్టూడియో నిర్మాణానికి భూములు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. అప్పుడు ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది.. బాలయ్య లాబియింగ్ చేసుకుని ఏపీలో స్టూడియో నిర్మాణానికి భూమి తీసుకోవచ్చు .. కానీ అందరితో పాటు విశాఖ లో తన స్టూడియో నిర్మాణానికి కూడా భూమి కావాలని దరఖాస్తు చేసుకున్నాడే తప్పా లాబియింగ్ చేయలేదు. బాలయ్య అందరి తో పాటు తాను దరఖాస్తు మాత్రమే చేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఏపీలో మళ్లీ ప్రభుత్వం మారింది. ఇక ఇప్పుడు మళ్లీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.. చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సారి వైజాగ్‌లో సినీ స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయిస్తే అక్కడ కూడా బాలయ్య స్టూడియో నిర్మాణానికి భూమి కేటాయించే అవకాశం ఉంది. ఏదేమైనా తెలంగాణ లో అయితే రేవంత్ సర్కార్ బాలయ్య స్టూడియో నిర్మాణానికి భూమి కేటాయిస్తే అది బంపర్ గిఫ్టే అనుకోవాలి.